పహల్గాంలో ముష్కరుల దాడిని ఖండించిన ముస్లిం

పహల్గాంలో ముష్కరుల దాడిని ఖండించిన ముస్లిం మైనార్టీలు
జమ్మికుంట మండల ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
జమ్మికుంట :నేటిధాత్రి

 

జమ్మికుంట పట్టణంలో ముస్లిం మైనారిటీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ అన్నం తిన్నావా లోని వైశారణ్ లోయలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన పైశాచిక మరణకాణం ఖండిస్తూ నిరసన ర్యాలీ కార్యక్రమం చేశారు
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఉగ్రవాదానికి మతోన్మాదమే తప్ప మతాలతో సంబంధం ఉండదని అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రతి ఒక్క భారతీయుడు సిద్ధంగా ఉన్నాడని పేర్కొంటూ విభిన్న మత సంస్కృతులకు నిలయం మన దేశానికే గర్వకారణమైన జమ్ము కాశ్మీర్లో గతంలో ఉన్న విపత్కర పరిస్థితులను ఎదురుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు పరుస్తూ జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో ఉగ్రవాద మూలాలు లేని జమ్మూ కాశ్మీర్లో ప్రజలు పర్యటన పర్యటన సురక్షితంగా ఉన్నారు అని యావత్ దేశం సంతోషించే ఈ తరుణంలో గతంలో పుల్వామా ఘటన కంటే దారుణమైన రీతిలో పహాల్గాం ఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండలం ముస్లిం ఐక్యవేదిక నాయకులు మౌలానా నజీర్, జాకీర్, షేక్ సాబీర్ అలీ, డాక్టర్ ఫిరోజ్, సర్వర్ పాషా ఫయాజ్,ఖాదర్ సుఫియాన్,సల్మాన్, సబ్జాద్,సాదిక్, అమీర్ షేక్, అప్రోజ్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version