బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులుగా గుడికందుల శివ
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని కంఠాత్మకూరు గ్రామ బిఆర్ఎస్ నూతన అధ్యక్షులుగా యువ నాయకులు గుడికందుల శివను నియమిస్తున్నట్లు నడికూడ బిఆర్ఎస్ మండల కమిటీ తెలిపారు.తన నియామకానికి సహకరించిన మాజీ అధ్యక్షులు రాయిడి నాదంరెడ్డి మరియు గ్రామ బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు శివ కృతజ్ఞతలు తెలియచేసారు.రాబోయే రోజుల్లో గ్రామంలో మీ అందరి సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని తెలిపారు.
