ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు గడువు పొడగింపు..

ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు గడువు పొడగింపు

ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇందిరా

భూపాలపల్లి నేటిధాత్రి

 

ఎస్సీ యాక్షన్ ప్లాన్ లో భాగంగా దరఖాస్తుల నమోదు గడువు పొడిగించబడింది. ఈనెల 2వరకు ఉన్న గడువు. ఇప్పుడు 08.04.2026 వరకు పొడిగించబడింది.
అలాగే, ఇట్టి యాక్షన్ ప్లాన్ లో బ్యాంకు అనుసంధానంతో ఆర్థిక సహాయ పథకములు రవాణా రంగం పధకం క్రింద ఈవి టూ వీలర్. ఈవి త్రి వీలర్ లు వ్యవసాయ పథకముల క్రింద సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్, పాడి గేదెలు, శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్య అభివృద్ధి కి ధరఖాస్తులు ఓబీఏంఏంఎస్ పోర్టల్ ద్వారా స్వీకరించబడతాయి.
అందువల్ల, అర్హులైన అభ్యర్ధులు గడువులోగా తమ దరఖాస్తులను నమోదు చేసుకోవాలని, జిల్లా స్థాయి లక్ష్యాల ప్రకారం లబ్దిదారుల ఎంపిక జరుగుతుందని తెలియజేయబడుచున్నది. కావున అర్హత ఆసక్తి గల షెడ్యూల్డ్ 08.04.2026 https://tgobmms.Cgg.gov.in దరఖాస్తు చేసుకుని అట్టి దరఖాస్తు ఫారంను సంబందిత మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో సమర్పించలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ఇ. ఇందిర, కార్యనిర్వాహక సంచాలకులు, జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవ సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్, జయశంకర్ భూపాలపల్లి ఒక ప్రకటనలో తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version