మోసపూరిత చర్యలకు పాల్పడుతున్న ఝరాసంగం ఏపీవో రాజ్ కుమార్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం ఏపీవో రాజ్ కుమార్ మోసపూరిత చర్యలు ప్రజల్లో ఆగ్రహం జహీరాబాద్ నియోజకవర్గం జర సంఘంలో పనిచేస్తున్న ఏపీవో రాజ్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని, తన పదవిని దుర్వినియోగం చేసుకుంటూ లాభాలు పొందుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రజలతో నమ్మకం కల్పించి, తరువాత మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పిన గ్రామస్థులు దీనిపై అధికారుల దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలువురు బాధితులు అతని వ్యవహారాలపై సాక్ష్యాధారాలు సమర్పించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై గ్రామస్థులు ఏకమై చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. సంబంధిత విభాగం అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. “రాజ్ కుమార్ లాంటి అధికారులు ఉండటం వల్లే సామాన్యులు నష్టపోతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని గ్రామ పెద్దలు వ్యాఖ్యానించారు. మాసునూరు సర్పంచ్ మాజీ స్వామి దాస్ మూడు సంవత్సరాలుగా నష్టపోతున్నానని అన్నారు.