ఎండతీవ్రతను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలి…

ఎండతీవ్రతను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలి

కౌన్సిలర్ బొచ్చు శ్యామల బాబురావు

పరకాల,నేటిధాత్రి

పట్టణంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 2వ వార్డు కౌన్సిలర్ బొచ్చు శ్యామల బాబురావు సూచించారు.మధ్యాహ్న సమయంలో అత్యవసరం లేకపోతే బయటకు వెళ్లకుండా ఉండాలని,తగినంత నీరు తాగుతూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని తెలిపారు.ప్రత్యేకంగా వ్యవసాయ కూలీలు పనులకు వెళ్లేవారు,రోడ్డు పక్కన వ్యాపారాలు నిర్వహించే వారు ఎండల ప్రభావం నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.తలపై గుడ్డలు,టోపీలు ధరించడం,తరచుగా నీరు తీసుకోవడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.వృద్ధులు,చిన్నపిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని,ఎండల తీవ్రత తగ్గే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆమె కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version