గొల్లపల్లి లో మాజీ హరీష్ రావు బహిరంగ సభకు ర్యాలీగా వెళుతున్న బీ ఆర్ ఎస్ నేతలు…

గొల్లపల్లి లో మాజీ హరీష్ రావు బహిరంగ సభకు ర్యాలీగా వెళుతున్న బీ ఆర్ ఎస్ నేతలు
వనపర్తి నేటిదాత్రి .

గొల్లపల్లిలో రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ సభకు వనపర్తి నుండి బీ ఆర్ ఎస్ నేతలు ర్యాలీగా ద్విచక్ర వాహనాలపై వెళ్లారు ఈ ర్యాలీలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఉంగుళం తిరుమల్ బీఆర్ఎస్ నేతలు వెళ్లారు ఈ సందర్భంగా తిరుమల్ మాట్లాడుతూ బీ ఆర్ ఎస్ శ్రేణులు కార్యకర్తలు రైతులు పాల్గొనాలని కోరారు గొల్లపల్లి ధర్నా చౌక్ దగ్గర బహిరంగ సభ ఉంటుందని బహిరంగ సభలో మాజీ మంత్రులు హరీష్ రావు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర జిల్లా బీఆర్ఎస్ నేతలు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు

సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్…

సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

సబ్ స్టేషన్ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్థల పరిశీలన చేశారు.
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం సమీపంలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థలాలను గురువారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఎన్పీడీసీఎల్ సీఈ అశోక్ తో కలిసి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, కలెక్టర్ పలు సూచనలు చేశారు.

పరిశీలనలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, సిరిసిల్ల డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version