మహిళా సర్పంచ్‌పై కులదూషణ –నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు…

మహిళా సర్పంచ్‌పై కులదూషణ –నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

గీసుగొండ,నేటిధాత్రి:

గీసుగొండ మండలం ఎలుకుర్తి గ్రామంలో మహిళా సర్పంచ్‌పై కులం పేరుతో దూషణకు పాల్పడిన వ్యక్తిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.గీసుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం, ఎలుకుర్తికి చెందిన మంద రమ (35), గ్రామపంచాయతీ ఎంపీడబ్ల్యూ సిబ్బంది, తన సహచరురాలు పులి సునీతతో కలిసి గ్రామ నర్సరీ పనులకు వెళ్తుండగా, అదే గ్రామానికి చెందిన దుమాల రాజు (36) మద్యం మత్తులో ఆమె వెంటపడి అసభ్యకరంగా ప్రవర్తించాడు.అనంతరం గ్రామ నర్సరీ వద్దకు వెళ్లిన రమను అక్కడున్న సర్పంచ్ దివ్యభారతి మరియు ఆమె భర్త రమేష్ కలిసి రక్షిస్తూ నిందితుడిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో దుమాల రాజు సర్పంచ్ దివ్యభారతిపై కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు.ఈ ఘటనపై బాధితురాలు మంద రమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు దుమాల రాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version