ఎన్నికలు పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలి : కమిషనర్ చంద్రశేఖర్…

ఎన్నికలు పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలి : కమిషనర్ చంద్రశేఖర్

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

 

మునిసిపల్ ఎన్నికలు పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని అలియాబాద్ మునిసిపల్ కమిషనర్ చంద్రశేఖర్ అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం పి ఓ, ఏ పి ఓ లకు మజీద్ పూర్ శ్రీ చైతన్య పాఠశాలలో మున్సిపల్ కమిషనర్, ట్రైనర్స్ ఆధ్వర్యం లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఎన్నికల విధులకు హాజరయ్యే పి ఓ, ఏ పి ఓ ఎన్నికల విధులపై శఅవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఓ, ఏ ఆర్ ఓ లు, ఎన్నికల సిబ్బంది, ట్రైనర్స్ పాల్గొన్నారు.

*అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.ఎల్.ఏ. జాబితా ఇవ్వండి..

*అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.ఎల్.ఏ. జాబితా ఇవ్వండి..

*నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి ఎన్. మౌర్య..

తిరుపతి(నేటిధాత్రి)

 

నియోజకవర్గ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాను అందజేయాలని నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారుఈ సందర్బంగా నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి మాట్లాడుతూ బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాను వీలైనంత త్వరగా అందజేయాలని తెలిపారు.

స్పెషల్ ఇంటెన్షవ్ రివిజన్ – 2026 పై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఇప్పటివరకు వచ్చిన వివిధ దరఖాస్తుల పరిష్కారం గూర్చి ప్రతినిధులకు వివరించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ సురేష్ బాబు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version