క్రీడా పోటీలను ప్రారంభించిన జిఎం రాజేశ్వర్ రెడ్డి…

క్రీడా పోటీలను ప్రారంభించిన జిఎం రాజేశ్వర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

కృష్ణ కాలనీలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ క్రీడా మైదానంలో డబ్ల్యూ పిఎస్ జిఎస్ 26వ వార్షిక క్రీడ పోటీలలో భాగంగా రీజియన్ స్థాయి ఫుట్బాల్ పోటీలను ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జియం మాట్లాడుతూ… క్రీడలు కేవలం ఆనందం మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి, శారీరక దృడాత్వానికి పట్టుదలకి ,దారితీసే మంచి మార్గం. ఈ రోజు మనం క్రీడల ప్రాముఖ్యతను మనస్పూర్తిగా గ్రహించి, పిల్లల నుండి పెద్దల వరకు అందరం క్రీడలను భాగస్వామ్యం చేసుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలన్నారు. క్రీడలు మన దేశ ఐక్యతను, సామాజిక సాంస్కృతిక విలువలను కూడా పెంపొందిస్తాయని తెలియజేశారు.
ప్రతి ఒక్కరూ ఈ క్రీడా స్ఫూర్తితో ప్రయాణం సాగిస్తూ తమ శారీరక, మానసిక శక్తిని, పెంపొంధించుకోవాలన్నారు సందర్భంగా నిర్వహించబడుతున్న సింగరేణి సంస్థ క్రీడల ప్రోత్సాహానికి, యువ ఉద్యోగులలో ప్రతిభను వెలికితీసి కోల్ ఇండియా స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతో క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని తెలియ జేశారు.
ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, క్రీడల , స్పోర్ట్స్ సూపర్వైజర్, పర్స శ్రీనివాస్, భూపాలపల్లి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పాక దేవయ్య, ఆర్‌జి -3 స్పోర్ట్స్ కోఆర్డినేటర్ అంజయ్య జనరల్ కెప్టెన్ మెడ.మల్లేశ్, భూపాలపల్లి ఫుట్బాల్ కెప్టెన్ పురుషోత్తమ్, ఆర్‌జి -3 ఫుట్బాల్ కెప్టెన్ రాహుల్ తదితర క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version