ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక పక్కాగా అమలు చేయాలి…

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక పక్కాగా అమలు చేయాలి

లక్ష్యం ప్రకారం ముందుకు వెళ్లాలి

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష

సిరిసిల్ల(నేటి ధాత్రి):

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12 వ తేదీ వరకు 99 రోజుల పాటు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక పై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులతో కలెక్టర్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, *ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక*లో భాగంగా జిల్లా అధికారి తమకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పథకాలు అమలు చేయాలని, లక్ష్యం ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించారు. మహిళా సంఘాల భవనాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. తమ పరిధిలోని అన్ని అంశాలపై యాక్షన్ ప్లాన్ అమలు చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు.

సమావేశంలో ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, హౌసింగ్ పీడీ వెంకట మాధవ రావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి…

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికా కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శనివారం జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 17, 31, 32, 33 వార్డులలో చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ సంపత్,చైర్ పర్సన్ దావ స్వాతి,వైస్ చైర్ పర్సన్ సత్యనారాయణ లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు వరకు 99 రోజుల కార్యచరణ రూపొందించడం జరిగిందని, క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.గ్రామ,మండల,నియోజకవర్గ,జిల్లా,రాష్ట్ర స్థాయిలలో కార్యచరణ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించడం,ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ లో ఉన్న పైళ్ల క్లియరెన్స్,ఆరోగ్యం,అరైవ్ అలైవ్,సంక్షేమం,పిల్లలు భద్రత,వ్యవసాయం, విద్య,యువత,మహిళలు,పర్యావరణం తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version