ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక పక్కాగా అమలు చేయాలి…

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక పక్కాగా అమలు చేయాలి

లక్ష్యం ప్రకారం ముందుకు వెళ్లాలి

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష

సిరిసిల్ల(నేటి ధాత్రి):

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12 వ తేదీ వరకు 99 రోజుల పాటు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక పై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులతో కలెక్టర్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, *ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక*లో భాగంగా జిల్లా అధికారి తమకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పథకాలు అమలు చేయాలని, లక్ష్యం ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించారు. మహిళా సంఘాల భవనాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. తమ పరిధిలోని అన్ని అంశాలపై యాక్షన్ ప్లాన్ అమలు చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు.

సమావేశంలో ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, హౌసింగ్ పీడీ వెంకట మాధవ రావు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version