ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి కలెక్టరేట్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధనకే దారి చూపాయని పేర్కొన్నారు. ఆయన పోరాట స్పూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, ముఖ్యంగా బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు గౌడ్ బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఇందిరా జిల్లా ఫోర్స్ అధికారి రఘు గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు
