డ్రైవర్లు వాహనం నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించకండి…

డ్రైవర్లు వాహనం నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించకండి
వనపర్తి నేటిదాత్రి .

రోడ్డుప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్‌లో సరైన సహాయం అందిస్తే మరణాల సంఖ్యను తగ్గించవచ్చు అని ప్రథమ చికిత్స, అత్యవసర స్పందనపై కనీస అవగాహన కలిగి ఉండాలని ఐజిపి డాక్టర్ గజరావు భూపాల్ అన్నారు.
కొత్తకోటలో రాష్ట్ర, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో కార్యక్రమానికి ఐజీపీ గజరావు భూపాల్ వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,వనపర్తి జిల్లా ఇంచార్జి ఎస్పీ డా. వినీత కార్యక్రమాన్ని ప్రారంబిం చారు మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, అంబులెన్స్ డ్రైవర్లు, ఆటోలారీ డీసీఎం డ్రైవర్లు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, యువత, విద్యార్థులకు 1000 మందికి నిపుణులచే గోల్డెన్ అవర్ సమయంలో ఎలా స్పందించాలి, ప్రాథమిక చికిత్స ఎలా అందించాలి, బాధితులను ఎలా తరలించాలి వంటి అంశాలపై నిపుణులైన డాక్టర్లచే సమగ్ర శిక్షణ అందించారు
అనంతరం డ్రైవర్లకువాహన డ్రైవర్లకు సీపీఆర్ శిక్షణ మరియు కంటి పరీక్షల వైద్య శిబిరాన్ని నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారుకలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ..రోడ్డు భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత. గోల్డెన్ అవర్ సమయంలో సమయానికి స్పందిస్తే ప్రమాదాల తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చు. ఈ తరహా శిక్షణా కార్యక్రమాలు గ్రామ స్థాయి వరకు విస్తరించి, అవగాహనను పెంపొందించడం అత్యంత అవసరం.అని అన్నారు
ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు వనపర్తి డిసిఆర్బి డిఎస్పి, బాలాజీ నాయక్, కొత్తకోట మున్సిపల్ చైర్మన్,పోతులపల్లి అరుణ, మున్సిపల్ వైస్ చైర్మన్,పల్లవి,మదనాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, ప్రశాంత్, కొత్తకోట సీఐ, రాంబాబు వనపర్తి సిఐ రత్నం ఆత్మకూరు, శివకుమార్ కొత్తకోట ఎస్సై, శివానందం, వనపర్తి జిల్లాలోని ఎస్సైలు, ప్రజా ప్రతినిధులు యువకులువిద్యార్థులు, డ్రైవర్లు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version