ఖమ్మంలో జరిగిన సిపిఐ వందేళ్ళ ఉత్సవాల బహిరంగ సభకు భారీగా తరలిన కరీంనగర్ జిల్లా సిపిఐ శ్రేణులు
కరీంనగర్, నేటిధాత్రి:
ఖమ్మంలో జరిగిన సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభకు సిపిఐ కరీంనగర్ జిల్లా నాయకులు, కార్యకర్తలు, పార్టీ, ప్రజా సంఘాల శ్రేణులు భారీగా తరలి వెళ్లడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఖమ్మం నగరంలోని ఎస్సార్ అండ్ బిజిఎన్నార్ మైదానంలో భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభ రాష్ట్ర కార్యదర్శి కూనoనేని సాంబశివ రావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా
సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ డి.రాజా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు నలభై దేశాల అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు, జాతీయ రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. ఖమ్మం నగరంలో లక్షలాది మందితో బహిరంగ సభ జరిగిందని, వందేళ్ల ఉద్యమ ప్రస్థానంలో కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన అనేక పోరాటాలు ఉద్యమాలు సాధించిన విజయాలపై నాయకులంతా సుదీర్ఘంగా వివరించారు. రానున్న రోజుల్లో భారతదేశంలో మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ నీ బలోపేతం చేయడం కోసం నిరంతరం పని చేయాలని వక్తలు దశ,దిశా నిర్దేశం చేశారనీ పంజాల శ్రీనివాస్ తెలిపారు. ఖమ్మంకు తరలి వెళ్ళిన వారిలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందే స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, కొయ్యడ సృజన్ కుమార్,గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బత్తుల బాబు, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయినీ తిరుపతి, పిట్టల సమ్మయ్య, న్యాలపట్ల రాజుతో పాటు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా రెండు వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
