గ్రామ గ్రామన మల్లికార్జున స్వామి..

గ్రామ గ్రామన మల్లికార్జున స్వామి
* కళ్యాణాలు దర్శించుకున్న తోటకూర వజ్రెష్ యాదవ్

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

మూడు చింతలపల్లి మున్సిపాలిటీ, అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్‌గడి మలక్‌పేట్, ఉద్దమర్రి గ్రామాల్లో శ్రీ మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు స్వామి, టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ తో కలసి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల సుఖసంతోషాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం స్వామివారి ఆశీస్సులు కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆర్టీఓ సభ్యుడు జైపాల్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version