ఆర్థిక సహాయం అందజేసిన మిత్రులు

ఆర్థిక సహాయం అందజేసిన మిత్రులు

కరీంనగర్, నేటిధాత్రి:

తమ తోటి క్లాస్మెంట్ కూన సాయి బాబా అనారోగ్యానికి గురైతే చలించిపోయిన చిన్ననాటి క్లాస్మెంట్స్ అంతా కలిసి వైద్య ఖర్చుల కోసం జమ చేసిన ఒక లక్షా ఎనిమిది వేల ఐదు వందల రూపాయలను హైదారాబాద్ లోని ప్రైవేటు హస్పిటల్ లో ఉన్న అతని భార్య కూన రజితకు శుక్రవారం అందజేశారు. ఈసందర్భంగా బూడిద సదాశివ, అందె చిన్న స్వామి మాట్లాడుతూ చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన కూన సాయిబాబాకు ఇటీవల బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయి తీవ్ర అనారోగ్యంనకు గురై హైదారాబాద్ లోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ కావడంతో డాక్టర్లు తక్షణమే ఆపరేషన్ చేయాలని అందుకు లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పడంతో సాయి బాబాను ఎలాగైనా బ్రతికించుకోవాలనే ఆకాంక్షతో అప్పులు తెచ్చి ఆపరేషన్ చేయించారు. ఇప్పటికే దాదాపుగా ఇరవై లక్షలు ఖర్చు అయ్యాయని సాయిబాబా అన్న కూన సంపత్ మరియు భార్య రజిత తెలిపారు.

 

 

అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన సాయిబాబాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో బ్రతుకుదెరువు కోసం కరీంనగర్ వెళ్లి ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసుకుంటూ తన భార్యను ఇద్దరు పిల్లలతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని, తన భార్య కూడా కుట్టు మిషన్ కుడుతూ బ్రతుకుతున్నారని తోటి క్లాస్మెంట్స్ బూడిద సదాశివ, అందె చిన్న స్వామి తెలిపారు. 1997-98 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న క్లాస్మెంట్స్ సాయిబాబా అనారోగ్య పరిస్థితి తెలుసుకొని వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు అందరు కలిసి లక్షా ఎనిమిది వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని సాయిబాబా భార్య రజితకు అందజేసి, చికిత్స పొందుతున్న సాయిబాబాను చూసి ఆరోగ్య పరిస్థితి గురించి రజితను అడిగి తెలుసుకొవడం జరిగిందని సదాశివ, స్వామి తెలిపారు. ఆర్థిక సహాయం అందజేసిన వారిలో మేకల కుమార్, వోద్దిరాల విజయ్ కుమార్, పులి శ్రీనివాస్, అంతగిరి సాయిలు, సుతారి శ్రీనివాస్, బూడిద బాలు, తదితరులున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version