లింగ నిర్ధారణ చట్టంపై అవగాహన సదస్సు….

లింగ నిర్ధారణ చట్టంపై అవగాహన సదస్సు

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

 

ముత్తారం మండలం, ఖమ్మంపల్లి (సందరెల్లి) గ్రామంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ మరియు నషాముక్త్ భారత్ ఆధ్వర్యంలో లింగ నిర్ధారణ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
మహిళల, బాలల హక్కులు: ఆడపిల్లల సంరక్షణ, లింగ నిర్ధారణ, అంటరానితనం, బాలల హక్కులు మరియు చట్టాలు, మహిళల హక్కులు గురించి వివరించారు.
* బేటీ బచావో బేటీ పఢావో: ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు, ఇది ఆడపిల్లలను రక్షించడం, వారికి విద్యను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
* బాల్య వివాహాల నివారణ: బాల్య వివాహాలను నివారించడానికి తీసుకున్న చర్యలు మరియు చట్టాల గురించి తెలియజేశారు.
* సహాయక సేవలు: అంగన్‌వాడీ సేవలు, చైల్డ్ హెల్ప్‌లైన్ మరియు సఖి సేవలు, సీనియర్ సిటిజన్లకు సంబంధించిన సహాయక సేవల గురించి కూడా వివరించారు.
* చట్టాలు, నేరాలు: పని ప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన చట్టం, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణ మరియు అత్యవసర సమయాల్లో ఉపయోగపడే హెల్ప్‌లైన్ నెంబర్ల గురించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో శ్యామల (సోషల్ వర్కర్), శ్రావణ్ (అవుట్‌రీచ్ వర్కర్), నషముక్త్ భారత్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల,సతీష్ (చైల్డ్ హెల్ప్‌లైన్ కౌన్సిలర్), హరీష్ (చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్‌వైజర్), అంగన్‌వాడీ టీచర్ తిరుమల,ఆశా వర్కర్ సరిత, ఆసుపత్రి సిబ్బంది, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version