డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డును అందుకున్న కెటిపిపి సూపరింటెండింగ్ ఇంజనీరింగ్

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డును అందుకున్న కెటిపిపి సూపరింటెండింగ్ ఇంజనీరింగ్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం చెల్పూర్ బహుజన సాహిత్య అకాడమి -నేషనల్ అవార్డు 2026 సంవత్సరమునకు గాను
ప్రముఖ సంఘ సేవకులు కెటిపిపి ఉద్యోగులకు కార్మికులకు అర్టీజన్ కార్మికులకు ఉద్యోగరిత్యా సమస్యలపై ‌సానుకూల అవగాహన కల్పించి పరిష్కారం కోసం ప్రయత్నం చేసే సూపరింటెండింగ్ ఇంజినీర్ జువ్విగుంట రామకృష్ణ చేసిన సేవలకు గుర్తింపుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్నారు ఏప్రిల్ 19వ తేదిన హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన బహుజన సాహిత్య ఆకాడమి 9వ తెలంగాణ స్టేట్ కాన్ఫరెన్స్ బహుజన సాహిత్య అకాడమి జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సంధర్భంగా నల్లా రాధాకృష్ణ మట్లాడుతూ. ఎస్.సి., ఎస్.టి., బి.సి. & మైనారిటీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏట ప్రజా ఉద్యమకారులకు, సంఘసేవకులకు, రచయితలకు, కవులకు మరియు స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలియజేశారు. తెలంగాణలోని 31 జిల్లాల నుండి సుమారుగా 300 మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్కి హాజరైనారని తెలియజేశారు.అవార్డు అందజేసిన వారితో పాటుగ ఉన్నవారు తెలంగాణ ఉద్యమకారులు రచయిత గాయకులు గిద్దె రాంనర్సయ్య, కమిటీ సభ్యులు బొమ్మకంటి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version