బోర్నపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ.
రాయికల్ జూలై 16, నేటి ధాత్రి.
రాయికల్ మండల పరిధిలోని బోర్నపెల్లి గ్రామంలో బుధవారం రాయికల్ మండల ఆర్ఐ పద్మయ్య, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ పథకం ద్వారా మంజూరైన ఇండ్ల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నరేష్, కోల శ్రీనివాస్.మాజీ సర్పంచ్ రాజు లత, ఆంజనేయులు, రాగుల సత్యం, లబ్ధిదారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.