కోల్‌కతాలో మరో దారుణం.. పుట్టిన రోజున యువతిపై అఘాయిత్యం…

కోల్‌కతాలో మరో దారుణం.. పుట్టిన రోజున యువతిపై అఘాయిత్యం

 

 

 

కోల్‌కతాలో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ యువతిపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. యువతి పుట్టిన రోజున సెలబ్రేట్ చేసుకుందామని తీసుకెళ్లి ఈ దారుణానికి తెగబడ్డారు.

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో మరో దారుణం వెలుగు చూసింది. ఓ యువతి (20) ఆమె పుట్టిన రోజునే అఘాయిత్యానికి గురయ్యింది. యువతికి పరిచయం ఉన్న ఇద్దరు యువకులు ఆమెను బర్త్‌డే పార్టీ పేరిట తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. కోల్‌కతా నగర శివారులోని రీజెంట్ పార్క్ ప్రాంతంలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. ప్రస్తుతం పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను చందన్ మలిక్, దీప్‌గా గుర్తించారు. దీప్ ప్రభుత్వ ఉద్యోగి అని కూడా తెలుస్తోంది (Kolkata gang rape Regent Park).

పోలీసు వర్గాల కథనం ప్రకారం, బాధితురాలిది హరిదేవ్‌పురా. యువతి పుట్టిన రోజు సందర్భంగా చందన్ ఆమెను బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుందామని దీప్ ఫ్లాట్‌‌కు తీసుకెళ్లాడు. అక్కడ వారు భోజనం చేశాక బాధితురాలు తన ఇంటికి వెళ్లిపోతానని చెప్పింది. కానీ నిందితులు ఆమెను అడ్డుకుని గదిలో బంధించి దారుణానికి ఒడిగట్టారు.

మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు తన ఇంటికెళ్లి కుటుంబసభ్యులకు జరిగిన దారుణం గురించి తెలిపింది. ఆ తరువాత పోలీసులు కేసు నమోదు చేశారు. చందన్ తనకు కొన్ని నెలల క్రితమే పరిచయమయ్యాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అతడి ద్వారా దీప్‌తో పరిచయమైందని తెలిపింది. అప్పటి నుంచీ తాము ముగ్గురం టచ్‌లోనే ఉన్నామని వెల్లడించింది. దక్షిణ కోల్‌కతాలోని ఓ పూజా కమిటీలో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తానని నిందితులు తనతో చెప్పారని పేర్కొంది. ప్రస్తుతం పరారీలో ఉన్న ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version