శ్రీశైలం పాదయాత్రగా బయలుదేరిన భక్తులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి క్షేత్రం నుండి శ్రీశైలం
శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి మహాక్షేత్రం వరకు 24 వ. మహా పాదయాత్ర శివ నామ స్మరణ చేస్తూ..ఝరాసంగం నుంచి శ్రీశైలంకు స్వాములు, భక్తులు పాదయాత్రగా శుక్రవారం బయలుదేరారు. శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం జెండాను ఊపి పాదయాత్రను ప్రారంభించారు. పరమ శివుని ఆశీస్సులతో పాదయాత్ర దిగ్విజయం కావాలని వేడుకుంటున్నామన్నారు. భక్తులు సుమారు 400 కిలో మీటర్ల పాదయాత్రను పది రోజుల పాటు కొనసాగిస్తారని, శ్రీశైలంలో స్వామిని దర్శించుకున్న అనంతరం పాదయాత్ర ముగుస్తుందన్నారు. ఈ పాదయాత్రలో స్వాములు, భక్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
