ఉత్తమ సేవలకు గుర్తింపు
గుండాల,నేటిధాత్రి:
ఆధార్ క్యాంపులో ఉత్తమ సేవలు అందించిన గుండాల మీసేవ నిర్వాహకుడు ఈర్ప కిషోర్ కు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుక్రవారం తన చాంబర్లో ప్రశంసాపత్రం అందజేశారు.
ఉత్తమ సేవలందించినందుకు వారిని అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
