గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
మనేన్న కుమారుడైన గొల్ల కిష్టాన్నకు చెందిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని జహీరాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి. నరసింహ రెడ్డి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.మాజీ వైస్ ఎంపీపీ వి. రాములు, టీపీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ కె. భీమయ్య, సీడీసీ డైరెక్టర్ మల్లారెడ్డి, మల్చల్మ సహకార సంఘం వైస్ చైర్మన్ ఇమామ్ పటేల్, నాయకుడు సుభాష్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమశేఖర్, గ్రామ సర్పంచ్ జగదంబ సోమశేఖర్, మాజీ ఎంపీటీసీలు శ్రీనివాస్, సురేష్, పలువురు మాజీ ఎంపీడీఓలు పాల్గొన్నారు.అనంతరం, ఇందిరమ్మ ఇళ్ల 8 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ పత్రాలను అందజేశారు. అర్హులైన వారందరికీ మద్దతు ఇస్తామని, నిరాశ్రయులైన పేదలందరికీ ఇళ్లు అందేలా చూస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. అంతేకాకుండా, ప్రతిఒక్కరూ వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి తమ ఇళ్లను కట్టుకోవాలని కోరారు.
