దాన్ని అద్భుతమైన ప్రదర్శన అనలేం..

దాన్ని అద్భుతమైన ప్రదర్శన అనలేం.. పాక్ పీఎం ట్వీట్‌పై ఆకాశ్ చోప్రా రియాక్షన్

 

పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆస్ట్రేలియా బి జట్టుపై సాధించిన విజయంపై ఆయన చేసిన ట్వీట్‌ను నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఈ విషయంపై స్పందించాడు.

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మరోసారి వార్తల్లో నిలిచారు. పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఆయన కురిపించిన ప్రశంసలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా బి జట్టుపై సాధించిన విజయాన్ని ఏదో ప్రపంచ కప్ గెలిచినంత రేంజ్‌లో పొగుడుతూ పాక్ ప్రధాని అభాసుపాలయ్యారు. ఆయన చేసిన ట్వీట్‌ను నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Akash Chopra) ఈ విషయంపై స్పందించాడు.

లాహోర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచులో పాకిస్థాన్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై పీఎం షరీఫ్(Shehbaz Sharif) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు. ‘ఆస్ట్రేలియాపై అద్భుతమైన ప్రదర్శన చేసిన టీమ్ పాకిస్థాన్‌కు అభినందనలు. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వి కృషి అమోఘం. దేశం గర్వించదగ్గ క్షణం ఇది’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దీనిపై ఆకాశ్ చోప్రా వెటకారంగా స్పందించాడు. ‘గౌరవంగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. ఇది ఆస్ట్రేలియా బి టీమ్‌తో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్ మాత్రమే. ఆసీస్ జట్టులోని కీలక ప్లేయర్లు ఎవరూ ఈ జట్టులో లేరు. 170 పరుగుల మ్యాచులో కేవలం 20 పరుగుల తేడాతో గెలవడాన్ని ‘అద్భుతమైన ప్రదర్శన’ అని పిలవలేం’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version