వెల్నెస్ సెంటర్ ను తనిఖీ చేసిన డిఎంహెచ్వో అప్పయ్య…

వెల్నెస్ సెంటర్ ను తనిఖీ చేసిన డిఎంహెచ్వో అప్పయ్య

హన్మకొండ, నేటిధాత్రి(మెడికల్):

హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి దవాఖాన ఆవరణలో ఉన్న (ఈ జే ఎచ్ ఎస్) ఉద్యోగులు, జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండావెల్నెస్ సెంటర్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని, అలాగే మందుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు స్టాక్ పరిశీలిస్తూ ఇండెంట్ చేయాలని అనుమకొండ డిఎంహెచ్ఓ డాక్టర్ ఏ అప్పయ్య సూచించారు. ఈరోజు ఆయన హనుమకొండ జిల్లా ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ నిఖిల్ తో కలిసి తనిఖీ చేశారు. ఏ మందులు అందుబాటులో ఉన్నాయి ,మందుల నిల్వ ఎలా ఉంది అలాగే రికార్డులను పరిశీలించారు. అలాగే ఓపిలో వైద్య సేవల తీరును ల్యాబ్ మరియు ఇతర విభాగాలను ఆయన పరిశీలించారు. మందులతో పాటు ఏ సమస్యలు ఉన్నా ముందుగానే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. చికిత్స నిమిత్తం వచ్చినవారికి ఓపికతో, మర్యాదతో వ్యవహరించి తగిన చికిత్స అందించాలన్నారు. ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ నిఖిల్
డాక్టర్ చరణ్, డాక్టర్ సుస్మిత డాక్టర్ చైతన్య, డెమో వి అశోక్ రెడ్డి, శ్రవణ్ సురేష్ పాల్గొన్నారు.

రేడియోగ్రాఫర్ కృష్ణను సన్మానించిన డిఎంహెచ్ఓ అప్పయ్య..

రేడియోగ్రాఫర్ కృష్ణను సన్మానించిన డిఎంహెచ్ఓ అప్పయ్య

కృష్ణను అభినందించింన ఆసుపత్రి సిబ్బంది

పరకాల నేటిధాత్రి
17,18,19 తేదీలలో జరిగిన టిబి ముక్త్ భారత్ ప్రోగ్రాం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మరియు జిల్లా క్షయ నివారణశాఖ నిర్వహణ కార్యక్రమంలో భాగంగా దగ్గు,జ్వరంతో బాధపడుతున్న రోగులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ అధిక మొత్తంలో ఎక్స్రేలు తీసినందున పరకాల ప్రభుత్వ రేడియోగ్రాఫర్ గాను రాసమల్ల కృష్ణని అభిందించి డిఎంహెచ్ఓ అప్పయ్య,డిస్టిక్ టిబి కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్.హిమబిందు,డిసిహెచ్ గౌతమ్ చౌహాన్,ఆర్ఎంఓ బాలకృష్ణ లు శాలువాతో సత్కరించి అభినందించారు.ఈ సందర్బంగా డిఎంహెచ్వో అప్పయ్య మాట్లాడుతూ ఇలానే పేద ప్రజలకోసం నిరంతరం పనిచేస్తూ ఉండాలని,ఇలాంటి సేవలు పరకాల పరిసర ప్రాంత ప్రజలకు అనునిత్యం అందించాలని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version