అంతర్రాష్ట్ర బస్సులో పట్టుబడిన రూ.72 లక్షల నగదు.. ఇద్దరు అరెస్టు
కేరళలోని కొట్టాయం ప్రాంతంలో అంతర్రాష్ట్ర బస్సులో తరలిస్తున్న రూ.72 లక్షలను ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఏపీకి చెందిన షేక్ జాఫర్, పాషాస్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
కొట్టాయంలో(Kerala Cash Seizure) అంతర్రాష్ట్ర బస్సులో లెక్కల్లో చూపని సుమారు రూ.72 లక్షల నగదును ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా ఏపీ, కేరళ మధ్య నడిచే అంతరాష్ట్ర బస్సులో ఈ డబ్బును గుర్తించారు. వీటిని తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల(AP Men Detained in Kerala)ను అదుపులోకి తీసుకున్నారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, కేరళలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సందర్భంగా మాదకద్రవ్యాల, నల్లధనం అక్రమ రవాణ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. కొట్టాయంలోని కురవిలంగాడ్‌లో జరిగిన తనిఖీలలో, అధికారులు బస్సులోని ఒక బ్యాగ్‌లో దాచిన నగదు కట్టలను కనుగొన్నారు. మరింత అనుమానం రావడంతో ఇద్దరు ప్రయాణికులను తనిఖీ చేయగా, వారి వద్ద మరింత నగదు ఉన్నట్లు గుర్తించారు.
