చనిపోయిన కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందించిన మాజీ సర్పంచ్…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన. నిరుపేద కుటుంబం ముద్దం బుచ్చవ్వఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే ఈ విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు అo కారపు .రవి తన ఔదార్యం చాటుకుంటూ. చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి మనోధైర్యం ఇచ్చి ఆమె పేరున ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారాలు అందించేందుకు ముందు ఉంటానని వారికి హామీ ఇస్తూ వారు ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. స్థానిక సిరిసిల్ల ఎమ్మెల్యే. కెటి రామారావు దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ పరంగా వచ్చే సహాయ సహకారాలు అందిస్తామని బీ ఆర్ఎస్ పార్టీ మీకు మీ కుటుంబానికి ఎల్లకాలం అండగా ఉంటుందని తెలియజేస్తూ. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ముద్దం బుచ్చవ్వ కుటుంబానికి 50 కేజీల బియ్యం అందించడం జరిగింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆంకారపు రవీందర్ కి వారి కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలిపారుకార్యక్రమంలో. బహుజన సమాఖ్య అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్. వడ్డెర సంఘం మండల అధ్యక్షులు అలకుంట. దుర్గయ్య. కుటుంబ సభ్యులు మొత్తం మల్లయ్య నరేష్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
