జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు
వీణవంక, నేటి ధాత్రి:
వీణవంక మండల పరిధిలోని చల్లూర్ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని వారోత్సవాల ముగింపు సందర్భంగా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంపత్ కుమారా చారి మాట్లాడుతూ, అమ్మ ఫౌండేషన్ వారు మా పాఠశాలలో ప్రతినిత్యం పిల్లలను ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ
వారి మాట, పాటలతో పిల్లలను చైతన్య పరుస్తున్నారని అభినందించారు.
ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కవి, గాయకులు గోనెల సమ్మన్న , ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్, ముఖ్య సలహాదారుడు గాయకడు దరిపెల్లి మురళి, సభ్యులు గంధం సుమన్, గాయకుడు పొట్టాల శివ,పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
