భోజనం తర్వాత సోంపు ఎందుకు పెడతారు…

హోటళ్లలో భోజనం తర్వాత సోంపు, చక్కెర మిఠాయిలు ఎందుకు పెడతారో తెలుసా.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

 

 

భోజనం తర్వాత సోంపు, చక్కెర మిఠాయిలు తినడం పెద్దల కాలం నుంచి సాంప్రదాయంగా వస్తోంది. అయితే దీని వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..

ఏ హోటల్లోనైనా భోజనం చేయగానే సోపు, చిన్న చిన్న చక్కె మిఠాయిలను కలిపి అందుబాటులో ఉంచుతారు. చాలా మంది అందరితో పాటూ కొన్ని తీసుకుని నోట్లో వేసుకుని నమిలేస్తుంటారు. అంతే తప్ప.. హోటళ్లలో వీటిని ఎందుకు పెడతారు.. వీటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలీదు. వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జనం తర్వాత సోంపు, చక్కెర మిఠాయిలు (Fennel and Sweets) తినడం పెద్దల కాలం నుంచి సాంప్రదాయంగా వస్తోంది. అయితే దీని వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆహారం త్వరగా జీర్ణం అవడంతో పాటూ నోటి దుర్వాసనను వదిలించుకోవడానికి కూడా ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు.

సోంపు తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అలాగే చక్కెర మిఠాయిలో ఉండే చల్లదనం శరీరంలో ఆమ్లతత్వం, గ్యాస్‌ను తగ్గిస్తుంది. మరోవైపు సోంపులో ఉండే సహజ నూనె నోటికి తాజాదనాన్ని అందిస్తుంది. అదేవిధంగా చక్కెర మిఠాయిలు నోటిని శుభ్రం చేయడంలో సాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది భోజంన చేసిన తర్వాత ఏదైనా తినాలని అనుకుంటుంటారు. అలాంటి వారికి సోంపు, చక్కెర మిఠాయిలు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అని నిపుణులు సూచిస్తున్నారు.

సోంపు, చక్కెర మిఠాయిలను కలిపి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుందట. అలాగే కడుపు తేలిగ్గా మారుతుంది. మరోవైపు సోంపు పేగు ఆరోగ్యం, పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. అదేవిధంగా మెనోపాజ్ సమయంలో మహిళలు ఎదుర్కొనే అనేక సమస్యల నుంచి సోంపు ఉపశమనం కలిగిస్తుంది. అయితే వీటిని అతిగా తీసుకుంటే మాత్రం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version