బంపరాఫర్: మహిళలకు ఏటా సంక్రాంతికి రూ.30 వేలు…

బంపరాఫర్: మహిళలకు ఏటా సంక్రాంతికి రూ.30 వేలు

అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఎన్నికల ప్రచారం చివరి రోజున ఒక సంచలనాత్మక ప్రకటన వచ్చింది. మహిళలకు ఏటా సంక్రాంతికి రూ.30 వేలు.. వాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు..

ఇంటర్నెట్ డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఎన్నికల ప్రచారం చివరి రోజున ఒక సంచలనాత్మక ప్రకటన వచ్చింది. మహిళలకు ఏటా సంక్రాంతికి రూ.30 వేలు.. వాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు ఆర్జేడీ పార్టీ నేత, కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్. తన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ‘మాయ్-బహిన్ మాన్ యోజనా’పేరిట ఈ పథకం తీసుకొస్తామని చెప్పారు.

ఈ యోజన కింద, ప్రతి మహిళకు మకర సంక్రాంతి (జనవరి 14) నాడు రూ. 30,000 నగదు సహాయం అందజేయబడుతుందని తేజస్వి పేర్కొన్నారు. ‘మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, మకర సంక్రాంతి నాడు ఈ యోజనను అమలు చేస్తాం. ఇది బీహార్‌లోని ప్రతి తల్లి, సోదరి ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు సహాయపడుతుంది,’ అని చెప్పుకొచ్చారు.

 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version