దళిత బహుజన నాయకుల సస్పెన్షన్ సిగ్గుచేటు
తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి
కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న దళిత బహుజన నాయకుల సస్పెన్షన్ సిగ్గుచేటని జాతీయ మాల మహానాడు డివిజన్ అధ్యక్షులు గోడిశాల నవీన్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మంద యాకమల్లు లు అన్నారు. గురువారం జాతీయ మాల మహానాడు జిల్లా యూత్ నాయకులు ఎనమాల రాకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ
తొర్రూరు మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దళిత బహుజన బిడ్డలు మెరుగు మల్లేశం గౌడ్,చిట్టిమల్ల మహేష్,బాలు నాయక్ లను అనైతికంగా పార్టీ నుంచి బహిష్కరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి దళిత బహుజనల ఆశయాలు, అభివృద్ధి కోసం అహర్నిశలు చేస్తూ పార్టీలో వివిధ హోదాలలో గుర్తింపు తెచ్చుకొని పార్టీలో జరుగుతున్న విధానాలను ప్రశ్నించినందుకు నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి ఒంటెద్దు పోకడలను సరిచేసుకోవాలని, సీనియర్ నాయకులను కలుపుకొని కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని అడిగినందుకు సస్పెండ్ చేయడం వారి అగ్రవర్ణ నిరంకుశత్వానికి నిదర్శనమని అన్నారు.మహేష్ మాల మహానాడు జిల్లా అధ్యక్షుని హోదాలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు పనిచేస్తున్నాడని, వీళ్ళకంటే ఎక్కువగా మాట్లాడిన అగ్రవర్ణ నాయకులను సస్పెండ్ చేసి నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.ఝాన్సీ రెడ్డి తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేయాలని లేనిపక్షంలో మాల మహానాడు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దళిత బహుజన బిడ్డల పక్షాన పోరాడుతామని అన్నారు.ఈ సమావేశంలో మాల మహానాడు మండల అధ్యక్షులు అనపర్తి నగేష్,నాయకులు ఎనమాల అంజయ్య, మగ్గిరి వెంకటేశ్వర్లు, కోడిరెక్కల దినేష్, గందారి యశ్వంత్, ధర్మారపు వెంకన్న, ప్రశాంత్,