వెండి,బంగారు ఆభరణాలతో నగదు స్వాధీనం
దొంగిలించబడిన రూ 10,97,600 విలువ గల బంగారు వెండి ఆభరణాలు పూర్తి సొత్తు రికవరీ చేసి బాధితులకు భరోసా కల్పించిన పోలీసులు
జైపూర్, నేటి ధాత్రి:
రామగుండం పోలీస్ కమిషనరేట్ నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న సల్పల శ్రీనివాస్ (45) ను నీల్వాయి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లతో కలిసి బుధవారం ఏసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ తేదీ 26/27-05-2024 అర్ధరాత్రి సల్పల శ్రీనివాస్ తండ్రి:లేట్ లింగయ్య వయసు 45 సంవత్సరాలు, కులం గొల్ల, వృత్తి కూలీ, వేమనపల్లి మండలం కల్మల పేట గ్రామానికి చెందిన వ్యక్తి బాధితుని ఇంట్లోకి చొరబడి దొంగతనంకు పాల్పడినాడు అని అనుమానం కలదు అని ఫిర్యాదుదారు నెందుగూరి రామన్న తండ్రి: కిష్టయ్య వయసు 60 సంవత్సరాలు, కులం బారే, వృత్తి వ్యవసాయం, నివాసం కేతనపల్లి గ్రామం ,వేమనపల్లి మండలం, ఫిర్యాదు చేయగా ఫిర్యాదు ప్రకారం క్రైమ్ నెంబర్ 35/2024 , యు ఎస్. 457, 380, 75 ఐపిసి సెక్షన్లతో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.దర్యాప్తులో భాగంగా వెంటనే నీల్వాయి ఎస్సై, సిఐలు కలిసి చెన్నూర్ రూరల్ పరిసర ప్రాంతాలలో టీంలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.నిందితుని కోసం వెతుకుతుండగా29/05/2024 బుధవారం రోజున మల్లంపేట గ్రామ సమీపాన నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన నిందితుడు సల్పల శ్రీనివాస్ ను పట్టుకోవడం జరిగిందన్నారు. నిందితుని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా బంగారు, వెండి ఆభరణాలతో పాటు నికర నగదు 2,62,600/ ను స్వాధీనం చేసుకుని అతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగిందని చెప్పారు. నిందితున్ని కోర్టు ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరుగుతుందని తెలిపారు.నిందితుడు సల్పల శ్రీనివాస్ పై గతంలో కూడా వేమనపల్లి మండలంలోని పలు గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడిన కేసులు నమోదు కాపాడినవి వెల్లడించారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పోలీస్ శాఖ ప్రజలతో ఏర్పరచుకున్న సత్సంబంధాల వలన మండలంలోని యువకులు సోషల్ మీడియాలో నిందితుని వివరాలు విస్తృతంగా వైరల్ చేసినందున నిందితుని సమాచారం పోలీసులకు తెలిసింది. తథానుగుణంగా పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించిందన్నారు.ఈ సందర్భంగా నిందితున్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన చెన్నూర్ రూరల్ సిఐ సుధాకర్, నిల్వయ్ ఎస్సై శ్యామ్ పటేల్ పోలీస్ సిబ్బందిని, సహకరించిన ప్రజలను అభినందించారు.