# నర్సంపేట ఆర్డిఓ ఆఫీస్ ముందు న్యూ డెమోక్రసీ ఏఐకేఎంఎస్ ల ధర్నా.
నర్సంపేట,నేటిధాత్రి :
కల్తీ విత్తనాలను అమ్ముతున్న దుకాణదారులపై చర్యలు తీసుకోవాలని క్రిమిసంహారక మందుల కల్తిని అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయలు బోనస్ ను దొడ్డు రకం వడ్లకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట ఆర్డిఓ కార్యాలయం ముందు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, అఖిలభారత రైతుకూలీ సంఘం ఏఐకేఎంఎస్ ల ఆధ్వర్యంలో రైతుకూలీలు 20 నిమిషాలు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవోకు డిమాండ్లతో కూడిన వినతి పత్రమును అందజేశారు.ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాచర్ల బాలరాజు మాట్లాడుతూ వరంగల్ ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైందంటే విత్తనాల కల్తీమయం జరుగుతున్నదని దీనిని అరికట్టడంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా విత్తనాల షాపులపై తనిఖీలు నిర్వహించి నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై చర్య తీసుకోవాలని రైతులకు అన్ని రకాల విత్తనాలపై 75 శాతం సబ్సిడీపై విత్తనాలు అందించాలని ఆయన కోరారు.న్యూ డెమోక్రసీ డివిజన్ సెక్రెటరీ ఎలకంటి రాజేందర్ మాట్లాడుతూ ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ ని చేస్తామని ప్రకటించి అమలు చేయకుండా ఆగస్టు 15 వాయిదా వేసి రైతులు నిరాశపరిచిందని, వెంటనే రుణమాఫీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.అన్ని రకాల పంటలకు ముందుగానే ప్రణాళిక తయారుచేసి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు బండి కోటేశ్వరరావు, గంగుల దయాకర్, ఏఐకేఎంఎస్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు గట్టి కృష్ణ, జక్కుల తిరుపతి, జిల్లా నాయకులు భోగి సారంగపాణి,ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి పూలక్క, సంధ్య, పివైఎల్ జిల్లా నాయకులు గండ్రతి హరిబాబు, మల్లయ్య, వెంకట్ రెడ్డి, నరేందర్ రెడ్డి, సాంబయ్య తోపాటు తదితరులు పాల్గొన్నారు.