వనపర్తి నేటిదాత్రి;
పదో తరగతి విద్యార్థులు త్వరలో జరగబోయే పబ్లిక్ పరీక్షల్లో అత్యున్నత మార్కులు సంపాదించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూచించారు. మంగళవారం ఆత్మకూరులోని కేజీబీవీ పాఠశాలను అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వంటగది ని తనిఖీ చేశారు. విద్యార్థులకు పరిశుభ్రమైన మంచి భోజనం అందుతుందో లేదో కార్మికులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం ఆహార పదార్థాల మెనూ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ బోర్డు పరీక్షల్లో అత్యున్నత ఫలితాలు సాధించాలని చెప్పారు. రాష్ట్రంలోనే మన పాఠశాల ఆదర్శంగా నిలవాలని సూచించారు. కలెక్టర్ వెంట ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు. అంతకుముందు ఆత్మకూరులోని ప్రభుత్వ ఆసుపత్రి మరియు డిగ్రీ కళాశాలను కలెక్టర్ తనిఖీ చేశారు

