దళిత బహుజన సమస్యలకు రాజ్యాధికారమే పరిష్కారం.
#దళిత మేధాశక్తి దీక్ష ప్రారంభం.
#బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
దళిత బహుజనులు తరతరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు రాజ్యాధికారమే పరిష్కారం అనీ చింత కింది కుమారస్వామి అన్నారు.మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో దళిత మేధా శక్తీ వ్యవస్థాపక అధ్యక్షుడు బొట్లపవన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ జరిగిన దళిత మేధావుల దీక్షకు ముఖ్య అతిథిగా హాజరై దీక్షను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ఎన్నికల ముందు దళిత గిరిజన బీసీలకు ఎన్నో హామీలు ఇస్తూ ఓట్లు పొంది గెలిచిన తర్వాత అణగారిన కులాలను,వర్గాలను మోసం చేయడం అగ్రకుల పార్టీలకు రివాజుగా మారిందన్నారు.చెవెళ్ళ డిక్లరేషన్ ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీలకు 18శాతం రిజర్వేషన్ల పెంపు, అంబేద్కర్ అభయహస్తం పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సహాయం, ప్రభుత్వ ప్రొక్యూర్ మెంట్ అన్ని కాంట్రాక్టులలో 12శాతం రిజర్వేషన్లు, ప్రైవేటు విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే ప్రైవేటు కంపెనీలో రిజర్వేషన్ల కల్పన,ఇందిరమ్మ ఇండ్లకు 6 లక్షల రూపాయలు, అసైన్ భూముల పునరుద్ధరణ,సమాన హక్కులు, ప్రజాప్రయోజన భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూములు సేకరిస్తే పట్టా భూములతో సమాన పరిహారం, దళితులకు అటవీ హక్కుల చట్టాన్ని వర్తింపు ,అర్హులకు పోడు భూములు పెట్టాలి పంపిణీ , ఎస్సీలకు మూడు కార్పోరేషన్ లో ఏర్పాటు, టెన్త్ పాసైన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10వేలు,ఇంటర్ పాసైతే 15 వేలు, డిగ్రీ పాసై తే 25వేలు,పీజీ పూర్తి చేస్తే లక్ష ,ఎంఫిల్ , పీహెచ్డీ పూర్తి చేస్తే 5 లక్షలు అందిస్తామన్నారు.ప్రతీ మండలంలో ఒక గురుకులం ఉండేలా ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళ ఏర్పాటు వంటి హామీలను ఇరవై నెలలు కావస్తున్నా అమలు చేయడానికి కార్యాచరణ సైతం రూపొందించలేదన్నారు.ఈ హామీల అమలుకు దళితులు చేసే పోరాటాలకు బీసీ హక్కుల సాధన సమితి సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం అన్ని హామీలు కోసం కూడా బీసీలు రాబోయే రోజుల్లో ఉద్యమాలకు సిద్దం కాక తప్పదనన్నారు.ఎస్సీఎస్టీ బీసీలం జేఏసీగా ఏర్పడి హక్కుల సాధన కొరకై ఉద్యమించాలన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటీసి వైనాల వీరాస్వామి,మామిండ్ల మోహాన్ రెడ్డి, కొన్కటి వీరమల్లు, చెట్టుపెల్లి దామోదర్ ,దళిత మేధా శక్తి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెంబర్తి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొట్టె సురేష్, రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు అడ్డ రాజు, రాష్ట్ర కోశాధికారి సంపత్, సహాయ కార్యదర్శి నత్తి శ్యామ్, మండల అధ్యక్షుడు అడ్డ సతీష్,కనుక శ్రీకాంత్, కనకం సునీల్, కనకం తరుణ్, కనుక భరత్, కనకం రాజశేఖర్,దండు ప్రవీణ్, గంగారపు వినయ్, కనకం నవీన్,వక్కల దిలీప్, తదితరులు పాల్గొన్నారు