మల్లికార్జున్ ఖర్గేజీ త్వరగా కోలుకోవాలని కోరుకున్న రాష్ట్ర ఆరోగ్య మంత్రి
◆:- సీట్ వాన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి
◆:- రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి,
జహీరాబాద్ నేటి ధాత్రి:
రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర్ రాజ నరసింహ, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు,ముఖ్యంగా జహీరాబాద్ ముఖ్య కాంగ్రెస్ నాయకులు
సీట్ వాన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి, దేశ రాజధాని న్యూఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసానికి చేరుకుని ఆయనను కలిసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. శస్త్రచికిత్స తర్వాత మల్లికార్జున్ ఖర్గేజీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఆయన త్వరలోనే నూతన ఉత్సాహంతో ప్రజా జీవితంలోకి తిరిగి వస్తారని, ఎల్లప్పుడూ రాజకీయ మార్గదర్శకుడిగా పనిచేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ ఖర్గేను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, యేనం శ్రీనివాస్ రెడ్డి, కొచ్చుకుల రాజేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
