ఫోటోగ్రఫీలో రాష్ట్ర అవార్డు ఇరుకుల్ల వీరేశానికి ఘన సన్మానం
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిదాత్రి
ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన చెందిన ప్రతిభావంతుడు ఇరుకుల్ల వీరేశం అవార్డు అందుకోవడం గర్వకారణమని పోత్కపల్లి పద్మశాలి సంఘం గర్వంగా ప్రకటించింది. ఈ సందర్భంగా
పోత్కపల్లి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఇరుకుల్ల వీరేశంకి ఘన సన్మానం నిర్వహించారు.పద్మశాలి సంఘం అధ్యక్షులు దెబ్బట మల్లేశం మాట్లాడుతూ ఫోటోగ్రఫీ కళలో మన ప్రాంతానికి ఇరుకుల్ల వీరేశం పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారు. ఆయన సాధించిన విజయాలు యువతకు ఆదర్శం” అని పేర్కొన్నారు. అవార్డు సాధించిన ఇరుకుల వీరేశం మాట్లాడుతూ నా ప్రతిభను గుర్తించినందుకు, గౌరవించినందుకు సంఘానికి మరియు మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఇకపై ఇంకా మెరుగైన కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున దేవస్థాన ఆలయ చైర్మన్ చీకట్ల ముండయ్య, డైరెక్టర్ కట్కూరి సమ్మిరెడ్డి, ఇరవేణి రవి, సంఘం అధ్యక్షులు డబ్బేట మల్లేశం, గుడ్ల సదానందం, మామిడాల రవీందర్, గుండ్లపల్లి శ్రీనివాస్, దెబ్బట కుమార్, బూర రవీందర్, మామిడాల కేదారి, మరియు తదితరులు పాల్గొన్నారు.
