క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి…

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి
ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి 
భూపాలపల్లి నేటిధాత్రి 

డబ్ల్యూపిఎస్ అండ్ జి ఎ (వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్  గేమ్స్) క్రీడలలో భాగంగా భూపాలపల్లి  ఏరియా  రామగుండం -3 లను కలుపుకొని బాడీబిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ రీజినల్ మీట్ పోటీలను  సింగరేణి కృష్ణ కాలనీ మినీ ఫంక్షన్ హాల్ లో ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా
 జి‌ఎం మాట్లాడుతూ  డబ్ల్యూపిఎస్ అండ్ జి ఎ క్రీడలు సింగరేణి సంస్థలో ప్రతి ఒక్కరిలో ఒక సెలబ్రేషన్ లాగా నిలుస్తాయన్నారు . క్రీడలు మనందరిలో మానసిక ఉల్లాసం, సానుకూలతను నింపుతాయి. మంచి ఆరోగ్యం, క్రమశిక్షణ, టీమ్‌ వర్క్ ను వికసింపజేస్తాయి. నేటి ఆధునిక జీవన విధానంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం క్రీడల పాత్ర మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. 
మహిళ ఉద్యోగులు క్రీడల్లో రాణించాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా మైనింగ్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ విభాగాల్లో గణనీయంగా మహిళా ఆఫీసర్లు నియమితులయ్యారు. వీరు పురుషులతో సమానంగా భూగర్భ గనుల్లో పనులు నిర్వహిస్తున్నారు. సింగరేణిలో మహిళా రెస్క్యూ టీమ్స్ కూడా ఏర్పాటు అయ్యాయి. ఈ అవకాశాలతో మహిళలు సింగరేణి లో అన్ని రంగాల్లో, ముఖ్యంగా క్రీడలలో, స్ఫూర్తిగా ముందుకు రావాలని సూచించారు. మహిళల పాత్రను మరింత ప్రోత్సహిస్తూ, మహిళా ఉద్యోగులు క్రీడల్లో విజయం సాధించాలని చెప్పారు. త్వరలో జరిగే  కోల్ ఇండియా క్రీడా పోటీలలో  సింగరేణి ని ముందు వరుసలో నిలబెట్టాలని,  ఆత్మవిశ్వాసంతో పతకాలను గెలుచుకు రావాలని  కోరారు సింగరేణి సంస్థలో ప్రతి ఏడాది లాగే ఈ క్రీడలను నిర్వహించడం ఆనందకరం. ఉద్యోగులు చెడు వ్యసనాలకు దూరంగా వుండి, క్రీడలు రోజు వారి మన కార్యకలాపాలలో భాగం చేసుకోవాలని సూచించారు.మనం   ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. క్రీడలను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు, పాల్గొనే ఉద్యోగులకు, అభినందనలు తెలియజేశారు.  
ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, క్రీడల గౌరవ కార్యదర్శి శ్రావణ్ కుమార్ ,స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, భూపాలపల్లి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పాక దేవయ్య, అర్జీ-3 స్పోర్ట్స్ ఆర్డినేటర్, అంజయ్య, న్యాయ నిర్ణేతగా జిమ్ సమ్మయ్య, సీఎం ఓ ఐ ఏ ప్రతినిధి నజీర్, ఏఐటీయూసీ ప్రతినిధి  ఆసిఫ్ పాషా, ఐఎన్టియుసి ప్రతినిధి హుస్సేన్, శ్రీనివాసరెడ్డి, పాక శ్రీనివాస్, ఆఫీసుద్దీన్, బానోతు రమేష్,   తదితర క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version