వీర్యదాతకు అరుదైన క్యాన్సర్..

వీర్యదాతకు అరుదైన క్యాన్సర్.. ప్రమాదంలో 200 మంది చిన్నారుల ప్రాణాలు

ఓ వ్యక్తికి అరుదైన క్యాన్సర్ ఉన్న విషయం తెలియకుండా అతని నుంచి స్పెర్మ్‌ను తీసుకొని యూరప్ అంతటా దాదాపు 200 మంది పిల్లలను గర్భం దాల్చడానికి ఉపయోగించారు. ఇప్పుడు ఆ చిన్నారుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది.

యూరప్ అంతటా ఓ వీర్య దాత కారణంగా సుమారు 200 మంది చిన్నారుల ప్రాణాలు ప్రమాదంలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. క్యాన్సర్ కు కారణం అయ్యే ఓ ప్రమాదకరమైన జన్యు లోపం ఉన్న వ్యక్తి కి సంబంధించిన స్పెర్మ్‌ను ఉపయోగించి గర్భం దాల్చారు. తద్వారా జన్మించిన పిల్లల శరీరంలోని ప్రతి కణంలో దీని ప్రభావం ఉంటుందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ స్పెర్మ్ తో గర్భం దాల్చిన వారిలో కొంతమంది చిన్నారుల ఇప్పటికే క్యాన్సర్ బారిన పడి చనిపోయినట్లు తేలడంతో ఇప్పుడు మిగిలిన పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
డెన్మార్క్‌కు చెందిన ఓ వ్యక్తి స్పెర్మ్ లో TP53 అనే జన్యువులో లోపం ఉంది.ఈ లోపంతో ఉన్న ఉన్న వాళ్ల స్పెర్మ్ తో పుట్టి పిల్లలకు ‘లి-ఫ్రామినీ సిండ్రమ్’ అనే ఓ అరుదైన వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. 60 ఏళ్ల వయసు వచ్చే వరకు క్యాన్సర్ భారిన పడే అవకాశాలు తొంబై శాతం ఉంటుంది. ఈ సిండ్రోమ్ వల్ల రొమ్ము క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, ఎముక క్యాన్సర్లు (ఆస్టియోసార్కోమా) భారిన పడే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. డెన్మార్క్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ DR నివేదించిన తర్వాత ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్క డెన్మార్క్‌లో 99 జననాలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఓ విద్యార్థి డబ్బు కోసం 2005లో స్పెర్మ్ దానం చేశాడు. అతని నమూనాలను దాదాపు 17 ఏళ్ల పాటు వివిధ సంతాన సాఫల్య కేంద్రాలు ఉపయోగించాయి. అప్పట్లో సాధారణ స్క్రీనింగ్ టెస్ట్ లో ఈ జన్యు లోపాన్ని గుర్తించలేకపోయారు. డెన్మార్క్ కు చెందిన యురోపియన్ ఈ స్పెర్మ్ బ్యాంక్ ని 14 దేశాలలో దాదాపు 67 క్లీనిక్ లకు సరఫరా చేసింది.ఆ స్పెర్మ్‌ను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా కనీసం 197 మంది గర్భం దాల్చి పిల్లలకు జన్మనిచ్చి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

2025లో వైద్యనిపుణులు ఈ అంశాన్ని గుర్తించి హెచ్చరించడంతో అసలు విషయం బయటపడింది. ఏది ఏమైనా ఈ దారుణ ఘటనతో స్పెర్మ్ దాతల స్క్రీనింగ్, సంతాన సాఫల్య చికిత్సల నిబంధనలలో నిర్లక్ష్యం బయటపడింది. దారుణం ఏంటంటే.. UK లో ఈ దాత స్పెర్మ్ ని దాదాపు పది కుటుంబాలు ఉపయోగించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ జన్యుపరమైన లోపంతో ఉన్న చిన్నారులపై డాక్టర్లు స్పెషల్ ఫోకస్ పెట్టి, క్యాన్సర్ ని తొలిదశలోనే రూపుమాపే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version