ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు రామకృష్ణాపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు మాట్లాడారు. సోనియా గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు .తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేని నాయకురాలు సోనియా గాంధీ అని సుదీర్ఘకాలం తెలంగాణ ఉద్యమానికి న్యాయం చేయాలనే ఆకాంక్షతో ఆమె తీసుకున్న నిర్ణయం తో ఫలితాలను ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారని తెలిపారు. సోనియా గాంధీ ప్రస్తావన లేకుండా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడలేమని అన్నారు. రాజకీయంగా ఎంత నష్టం జరిగినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఆమె తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని అన్నారు. 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ చోరీ పై సంతకాల సేకరణ నిర్వహించినట్లు తెలిపారు. బిజెపి ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ఓటు చోరీ చేస్తుందని రాహుల్ గాంధీ ఆధారంతో నిరూపించారని అన్నారు. ఓట్ల దొంగతనాన్ని ప్రతి ఒక్కరు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం కళ, శ్యామ్ గౌడ్, పలిగిరి కనకరాజు, యాకుబ్ అలీ,పుల్లూరి కళ్యణ్, సురేష్,గొపతి బానేష్, బత్తుల వేణు,రామకృష్ణ,రామ్ సాయి, మల్లేష్,సరేష్, బత్తుల శ్రీను,మహిళా నాయకురాళ్లు పుష్ప,దీప, శారదా, రాజేశ్వరి, సృజన తదితరులు పాల్గొన్నారు.
