నూనె మరకలా..

నూనె మరకలా..

 

ఒక్కోసారి దుస్తుల మీద నూనె మరకలు ఎంత ప్రయత్నించినా వదలవు. ఈ చిట్కాలతో వాటిని వదిలించుకోవచ్చు.

  • నూనె మరక మీద కొద్దిగా బేకింగ్‌ సోడా చల్లాలి. పది నిమిషాలు అలాగే ఉంచాలి. తరవాత పాత టూత్‌ బ్రష్‌తో రుద్దితే నూనె మరక మాయమవుతుంది. గంజి పొడి వేసి రుద్దినా ఫలితం కనిపిస్తుంది.
  • చిన్న గిన్నెలో నాలుగు చుక్కల వెనిగర్‌ వేసి రెండు చుక్కల నీళ్లు చిలకరించి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చూపుడు వేలితో తీసుకుని మరక మీద రుద్దాలి. ఐదు నిమిషాల తరవాత మంచినీళ్లతో కడిగేస్తే నూనె మరక తొలగిపోతుంది.
  • మరక పడిన దుస్తులను చల్లని నీళ్లలో ముంచి తీయాలి. తరవాత మరక మీద కలబంద గుజ్జు వేసి రుద్దితే ఫలితం ఉంటుంది.
  • నూనె మరక మీద రెండు చుక్కల నిమ్మ రసం వేసి పది నిమిషాలు అలాగే ఉంచాలి. తరవాత దుస్తులను మామూలుగా ఉతికి ఆరేస్తే సరిపోతుంది.
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version