సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఎస్ఐ కాశీనాథ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
భారత రాజ్యాంగ చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని జహీరాబాద్ గ్రామీణ ఎస్ఐ యం కాశీనాథ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలక సంఘం పరిది రంజోల్ లో గల శ్రీ సంగమేశ్వర పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐ కాశీనాథ్ విద్యార్థులకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్న విద్యాహక్కు చట్టం ఆర్టికల్ 21 ఏ ద్వారా మనం ఇంత స్వేచ్చగా విద్యను అభ్యసించ గలుగుతున్నామని ఎస్ఐ ఆన్నారు. ప్రభుత్వం విద్యాలయాల్లో ఉచిత విద్యను అందిస్తూ, అనేక ఉచిత సౌకర్యాలు కల్పిస్తున్నారు అంటే అది విద్యా హక్కు చట్టం ద్వారానే అని పేర్కొన్నారు. విద్యార్థులకు సైబర్ అవేర్నెస్, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్-2006, ది తెలంగాణ ప్రివిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్-1997, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్-2009, చైల్డ్ లేబర్ యాక్ట్-2016, పీఓసీఎస్ఓ ఆక్ట్-2012 మరియు మోటార్ వెహికల్ యాక్ట్ లాంటి చట్టాల పైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు సుమారు 150 మంది పాల్గొన్నారు.