మక్కల కొనుగోలు కేంద్రాల వద్ద గన్ని సంచుల కొరత
రైతుల బాధలు పట్టించుకోని అధికారులు
ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ
భూపాలపల్లి నేటిధాత్రి
మక్కల కొనుగోలు కేంద్రాలు పేరుకే ఉన్నాయని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ ఆరోపించారు. ఈ సందర్బంగా ఆయన టేకుమట్ల మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు గన్ని సంచులు అందించే నాథుడే లేడని,ఇప్పటివరకు ఒక్క గింజను కూడా కొనుగోలు చేసిన పరిస్థితి లేదని, కల్లాల దగ్గర రైతులు ఎండకు అవస్థలుపడుతున్నారని వాతావరణం మార్పుల మూలంగా వర్షం వచ్చే పరిస్థితి ఉందని, టార్పాలిన్ లేక ధాన్యం తడిస్తే రైతులు ఆరుగాలం కష్టపడి పనిచేసిన పంట వర్షార్పణం అయ్యో అవకాశం ఉందని, ఇకనైనా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించి, ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్జి రాజయ్య, ఎలుకటి ఎల్లయ్య, చిలుక కుమార్, దసరాపు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు
