వారిధాన్యం పట్ల దళారులపై ఆధారపడొద్దు– కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్
నాగూర్లపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని 16వ వార్డు పరిధిలో నాగుర్లపల్లి గ్రామంలో మెప్మా ప్రియదర్శిని స్వయం సహాయక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తూకం, రవాణా సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్హెచ్జీ సీఏ బొల్లం కేదారి,అధ్యక్షురాలు సాదుల భాగ్యలక్ష్మి, కమిటీ సభ్యులు ముప్పారపు మానస, బుర్రి అనూష, జవ్వాజి సౌజన్య, బుర్రి సౌజన్య, మెప్మా అధికారులు, ప్రియదర్శిని సంఘం సభ్యులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
