శోక సంద్రలో గొర్రెల కాపరులు
* పిడుగుపాటుతో 94 గొర్రెలు మృతి
* వీదినపడ్డ గొర్రెల కాపరులు
మహదేవ్ పూర్ సెప్టెంబర్ 12 నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని అంబటిపల్లి, లెంకలగడ్డ గ్రామాల గోదావరి తీర ప్రాంతంలో పిడుగుపాటుతో 94 గొర్లు మృతి చెందాయని శుక్రవారం రోజున పశు వైద్యాధికారి రాజబాబు ఒక ప్రకటనలో తెలిపారు. గొర్రెల కాపరులు తెలిపిన వివరాల ప్రకారం అంబటి పెళ్లి, లింకలగడ్డ గోదారి తీర ప్రాంతంలో గొర్రెలను మేతకు తీసుకెళ్లి అక్కడే కంచ ఏర్పాటు చేసి ఉంచి రాత్రిపూట భోజనానికి ఇంటికి వచ్చి తిని వెళ్దామని సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వర్షం కురవడంతో అదే వర్షానికి పిడుగు పడి 94 గొర్లు మృతి చెందాయని, జీవనోపాధి కోల్పోయామని మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటూ కన్నీరు మున్నీ రౌతూ గొర్ల కాపర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న వైద్యాధికారులు తోటి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని వైద్య పరీక్షలు నిర్వహించి 94 గొర్రెలు మృతి చెందాయని వారి వివరాలు కాట్రేవుల ఆది 20 గొర్రెలు, కాట్రేవుల కత్తెరసాల 21 గొర్రెలు, కాట్రేవుల మల్లేషు 10 గొర్రెలు, పున్నమి చందర్ 15 గొర్రెలు, కాట్రేవుల శ్రీశైలం 11 గొర్రెలు, కాట్రేవుల కళ్యాణ్ 17 గొర్రెలు మృతి చెందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి రాజబాబు, అంబటి పెళ్లి పంచాయతీ కార్యదర్శి, పశు వైద్య సిబ్బంది, గొర్రెల కాపర్లు, ప్రజలు పాల్గొన్నారు.