అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో అర్ధరాత్రి బిఆర్ఎస్వీ సీనియర్ నాయకుల అరెస్టు ……
జహీరాబాద్ నేటి ధాత్రి:
విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల అసెంబ్లీ ముట్టడికి వెళ్తున బిఆర్ఎస్వీ సీనియర్ నాయకులు ఓంకార్, ఫయాజ్ లను అర్ధరాత్రి* పోలీసులు అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఇలాంటి అక్రమ అరెస్టుల ద్వారా ప్రజా వ్యతిరేకత నుండి ప్రభుత్వం తప్పించుకోలేదు… విద్యార్థి విభాగం నుండి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తు, అరెస్టుల ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నో రోజులు నడపలేరు కావున ప్రభుత్వం ఇకనైనా మేల్కొని విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాల్సిందిగా కోరుతున్నాము అని అన్నారు .
