బి.ఎల్ అల్ఫోన్సా కాన్వెంట్ పాఠశాలలో సైన్స్ ఫెయిర్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని బి.ఎల్ అల్ఫోన్సా కాన్వెంట్ హై స్కూల్ యందు పాఠశాల హెడ్ మిస్ సిస్టర్ బెస్సి, సిస్టర్ టెన్సీ ఆద్వర్యంలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలోని విద్యార్థినీ, విద్యార్థులు పలు రకాల ప్రాజెక్ట్ వర్క్స్‌ను సొంతంగా తయారు చేసిన ప్రదర్శనలో వాటి పనితీరును తోటి విద్యార్థులు, తల్లిదండ్రులకు వివరించారు. ఈ సందర్భగా పాఠశాల స్టాఫ్ సెక్రటరీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పిల్లల మనో వికాసానికి సైన్స్ ఫెయిర్‌లు ఎంతగానో దోహదం చేస్తాయని తెలిపారు. విద్యార్థులంతా నూతన సైన్స్ రంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం
చుట్టాలని సూచించారు. సైన్స్ ఫెయిర్‌లో భాగంగా విద్యార్థులు ట్రిగోనమెట్రి పార్క్, చంద్రయాన్-3, నర్స్వ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, నాచురల్ ఫార్మింగ్, వాటర్ క్యూరిఫికేషన్, డయాలసిస్, హార్ట్ వర్కింగ్ సిస్టమ్, హైడ్రాలిక్ రోబోటిక్ ఆర్మ్, ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ లాంటి ప్రాజెక్ట్ వర్స్క్ చేసి, వాటి పనితీరును వివరిస్తూ అందరిచేత ప్రశంసలు పొందారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
