ఎస్సీ హాస్టల్ వార్డెన్ భవాని సస్పెండ్
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు కృతజ్ఞతలు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక ఏఎన్టిసి కార్యాలయంలో ఎస్ఎంహెచ్ఎస్సి హాస్టల్ వార్డెన్ భవాని విద్యార్థినిపై అకారణంగా చితకబాధిందని తెలియడంతో ఎన్ఎస్ యు ఐ నాయకులమైన మేము తెలియడంతో వెంటనే స్పందించి వారు సంబంధిత అధికారైన ఎస్. సి. డ. బ్ల్యూ. ఒ ఇంచార్జ్ ఇంద్ర కి తక్షణమే కాల్ చేసి అకారణంగా చితకబాదినటువంటి హాస్టల్ వార్డెన్ భవాని పై తక్షణమే ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకోవాలని తెలియజేయగానే ఎంక్వయిరీ చేసి ఎస్సీ హాస్టల్ వార్డెన్ భవాని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసును కేసులను నమోదు చేసినందుకు ఎన్ ఎస్ యు ఐ పక్షాన హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. కానీ దయచేసి హాస్టల్ వాడేళ్లు గాని ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు రాబోయే రోజులలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి విద్యార్థిని విద్యార్థులు మీయొక్క బిడ్డల లాగా చూసుకొని వారి చదువులు ముందుకు సాగే విధంగా మీరు వ్యవహరించాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేయాలని ఎన్ ఎస్ యు ఐ పక్షాన మేము జిల్లా అధికారులను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో. రాజు, రాజశేఖర్, విజయభాస్కర్, తరుణ్, రాజేందర్,ప్రవీణ్,సాత్విక్ తదితరులు పాల్గొన్నారు
