కంఠాత్మకూర్ గ్రామ ప్రజలకు రుణపడి ఉంటా సర్పంచ్ కొంగంటి తిరుపతి
నడికూడ,నేటిధాత్రి:
గ్రామ అభివృద్దే పరమావధిగా భావించి గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తా
కంఠాత్మకూర్ గ్రామ ప్రజలు అధికార పార్టీకి ఓటు వేసి గ్రామాభివృద్ధికి బాటలు వేశారు అధికార పార్టీ సర్పంచ్ అభ్యర్థి కొంగంటి తిరుపతి ని గెలిపించి గ్రామాభివృద్ధికి పట్టం కట్టారు
గ్రామ అభివృద్దే లక్ష్యంగా-గ్రామ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తా అభివృద్ధి అనేది అధికార పార్టీతోనే సాధ్యం
గ్రామ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కృషి చేస్తా గ్రామమే నా దేవాలయం గ్రామ ప్రజలే నా దేవుళ్ళు నడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామములో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో పోలైన 2173 ఓట్లలో గ్రామ ప్రజలు ఓటర్ మహాశేయులు నా పై ఎంతో నమ్మకంతో నాకు 1075 ఓట్లు వేసి 429 ఓట్ల అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించి నాకు అఖండ విజయాన్ని అందించిన గ్రామ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా శక్తివంచన లేకుండా గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానని కంఠాత్మకూర్ గ్రామ నూతన సర్పంచ్ కోంగంటి తిరుపతి అన్నారు. నాకు అఖండ విజయాన్ని అందించిన నా గ్రామ ప్రజలకు ఓటరు మహాశేయులకు పేరుపేరునా కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలుపుతూ,గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
కంఠాత్మకూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొంగంటి తిరుపతి,ఉప సర్పంచ్ కంఠాత్మకూర్ కుమారస్వామి లను గ్రామస్తులు శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారంతో పనిచేయాలని సూచించారు. గ్రామపంచాయతీ పరిధిలో పారదర్శక పాలన, అభివృద్ధి పనుల్లో వేగం తీసుకురావాలని ఆకాంక్షించారు.సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని వృధా చేయకుండా వృధా చేయకుండా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.మౌలిక సదుపాయాలు,రోడ్లు, తాగునీరు,పారిశుద్ధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వ బడుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సన్మానించిన వారు మంత్రపురి రఘుపతి, సదానందం,మేకల చిన్న రవి, రామ్ శంకర్,రాజు,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
