మల్లక్కపేటకు చెందిన సరితకు డాక్టరేట్
గవర్నర్ చేతులమీదుగా పట్టా అందుకున్న కేశరాజు సరిత
పరకాల నేటిధాత్రి
మండలంలోని మల్లక్కపేటకు చెందిన కేశరాజ్ సరిత జూనియర్ కాలేజీ లెక్చరర్ గా విధులు నిర్వరిస్తుంది.సోమవారం రోజున సరితకు కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది.తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవవర్మ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాను అందుకోకున్నారు.తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ వర్ధన్నపేటలో జూనియర్ కాలేజీ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న ఈమె పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో” మైక్రో ఫైనాన్స్ అండ్ ఎంపవర్మెంట్ రూరల్ ఉమెన్ ఏకే స్టడీ ఇన్ వరంగల్” అంశంపై పరిశోధనాత్మక గ్రంథం సమర్పించినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య మల్లరెడ్డి తెలిపారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆచార్య టి. యాదగిరిరావు పర్యవేక్షణలో తన పరిశోధన పూర్తి చేశానని తాను 2007 లో కాంట్రాక్టు లెక్చరర్ గా ఖమ్మం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో విధులు,2008-2018తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల జఫర్గడ్ నందు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ గా కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా విధులు నిర్వర్తించడం జరిగిందని,2018 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గురుకుల కళాశాలల ఉపాధ్యాయ ఎంపిక లో భాగంగా తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కాజీపేట బాలురకు కు పిజిటిగా సెలెక్ట్ అయి,2021 లో ప్రమోషన్తో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ వర్ధన్నపేట లో జూనియర్ కాలేజ్ లెక్చరర్ గా మారి ప్రస్తుతం అక్కడే విధులు నిర్వహిస్తూన్నారు.పరిశోధన సమయంలో ఎన్నో అవరోధాలను అధిగమించి ఇట్టి గ్రంధాన్ని రాసి సమర్పించినట్లు,ఈ సమయంలో సహకరించిన తల్లిదండ్రులకు,గురువులకు,కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపి తన జీవిత భాగస్వామి దొమ్మటి రాజేందర్ కి అందరికీ ఎప్పటికి రుణపడి ఉంటానని అన్నారు.
సరిత డాక్టరేట్ అందుకోవడం సంతోషకరం-అర్జున్ స్వేరో
స్వేరోస్ ఇంటర్నేషనల్ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు పోతుగంటి అర్జున్ స్వేరో మాట్లాడుతూ సరిత డాక్టరేట్ అందుకోవడం సంతోషకరమని అన్నారు.చిన్నప్పటినుండి చాలా కష్టపడి పేదరికం నుంచి వచ్చి ఎంతోమంది విద్యార్థులను మార్గదర్శకంగా ఉంటూ ఉత్తమ ఫలితాలను సాధించడంలో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో సరిత పాత్ర గణనీయమైనదని,ఆమె వృత్తి నైపుణ్యాన్ని గమనించిన స్వేరోస్ ఇంటర్నేషనల్ సంస్థ 2025 సావిత్రిబాయి పూలే జన్మ దినోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా ఎంపిక చేసి డాక్టర్.ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ చే ఘనంగా సన్మానించడం జరిగిందని తెలిపారు.ఈ సందర్బంగా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు సరితకు శుభాకాంక్షలు తెలిపారు.